లక్ష్యం కోసం పోరాడే సమయంలోనూ అహింసామార్గాన్ని అనుసరించాలి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- ముఖ్యంగా యువత ఈ మార్గాన్ని అనుసరించాలి
- సత్యం, అహింసలు నిత్య జీవితంలో భాగం కావాలి
- గణతంత్ర రాజ్యాన్ని నడిపించేది ప్రజలే
గణతంత్ర రాజ్యాన్ని నడిపించేది ప్రజలేనని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం ఈ రెండూ కీలకపాత్ర పోషించాలని సూచించారు. మనిషి చేస్తోంది తప్పా? ఒప్పా అనే దానిపైనే ప్రజాస్వామ్యం పని తీరు ఆధారపడి ఉంటుందని అన్నారు. దేశ సంక్షేమమే ధ్యేయంగా ప్రజలు ముందుకు వెళ్లాలని సూచించిన రామ్ నాథ్ కోవింద్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు.