అందుకే మానసిక ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతోంది.. గుర్తించిన అమెరికా పరిశోధకులు

  • ఎలుకలపై పరిశోధన 
  • ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్ల దగ్గర ఉండే మెలనోసైట్లు ప్రభావితం 
  • దీనివల్ల తల నెరుస్తోందన్న పరిశోధకులు 
చిన్న వయసులోనే చాలా మంది వెంట్రుకలు తెల్లబడతాయి. దీనివల్ల తలకు రంగులు వేసుకోవడం, వైద్యులను సంప్రదించడం వంటివి చేస్తుంటారు. వెంట్రుకలు తెల్లబడడానికి గల కారణాలపై పరిశోధనలు జరిపిన అమెరికా శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు. మానసిక ఒత్తిడికి, వెంట్రుకలు తెల్లబడటానికి మధ్య సంబంధం ఉందని చెప్పారు.

ఒత్తిడిని కలుగజేసే ఓ రకమైన ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు ఎలుకల్లో ప్రవేశపెట్టి చేసిన ప్రయోగంలో ఈ విషయాన్ని గుర్తించారు. వెంట్రుకల రంగులో మెలనోసైట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే, ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్ల దగ్గర ఉండే మెలనోసైట్లు ప్రభావితం అవుతాయని దీనివల్ల తల నెరుస్తోందని తెలిపారు. 
Go Back to Shorts
hair
america
health

More Telugu News