టాస్ గెలిచిన సన్‌రైజర్స్... అనారోగ్యంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం
- కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
- హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్
- సన్‌రైజర్స్ జట్టులోకి స్మరణ్ రవిచంద్రన్, హర్షల్ పటేల్
- కోల్‌కతా జట్టులోకి ఫిన్ అలెన్, మనీశ్ పాండే
- అనారోగ్యంతో నితీశ్ రెడ్డికి విశ్రాంతి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ తుదిజట్లలో రెండేసి మార్పులు చేశాయి. సన్‌రైజర్స్ జట్టులో అనారోగ్యం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి దూరమవగా, అతని స్థానంలో స్మరణ్ రవిచంద్రన్ అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే హర్ష్ దూబే స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు, కోల్‌కతా జట్టులో టిమ్ సీఫెర్ట్, రమణ్ దీప్ సింగ్ స్థానాల్లో ఫిన్ అలెన్, మనీశ్ పాండే బరిలోకి దిగుతున్నారు.
టాస్ గెలిచిన అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ, "మేం మొదట బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బాగుంది, వాతావరణం చాలా వేడిగా ఉంది. అందుకే బ్యాటింగ్ చేసి మంచి స్కోరు చేయాలనుకుంటున్నాం. మా బ్యాటింగ్ శైలి మాకు బాగా పనిచేస్తోంది. నితీశ్ అనారోగ్యంతో దూరం కావడంతో స్మరణ్ అరంగేట్రం చేస్తున్నాడు" అని వివరించారు.
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ, "మేం కూడా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. విరామం మాకు బాగా కలిసొచ్చింది. మా లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం దొరికింది. చిన్న చిన్న సందర్భాల్లో గెలవడం ముఖ్యం" అని చెప్పాడు.