అందుకే మానసిక ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతోంది.. గుర్తించిన అమెరికా పరిశోధకులు
- ఎలుకలపై పరిశోధన
- ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్ల దగ్గర ఉండే మెలనోసైట్లు ప్రభావితం
- దీనివల్ల తల నెరుస్తోందన్న పరిశోధకులు
ఒత్తిడిని కలుగజేసే ఓ రకమైన ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు ఎలుకల్లో ప్రవేశపెట్టి చేసిన ప్రయోగంలో ఈ విషయాన్ని గుర్తించారు. వెంట్రుకల రంగులో మెలనోసైట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే, ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్ల దగ్గర ఉండే మెలనోసైట్లు ప్రభావితం అవుతాయని దీనివల్ల తల నెరుస్తోందని తెలిపారు.