సీఎంగా జగన్ నైతిక అర్హత కోల్పోయారు: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
- ఒక్క రాజధానిని నిర్మించలేనివారు మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారు?
- ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిలిస్తున్నారు
- మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం
స్వప్రయోజనాల కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిలిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం దీక్షలు చేస్తున్న మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. రాష్ట్రాన్ని పాలించే నైతిక అర్హతను జగన్ కోల్పోయారని చెప్పారు. శాసనమండలిని తండ్రి రాజశేఖర్ రెడ్డి పున:ప్రారంభిస్తే... ఇప్పుడు కుమారుడు జగన్ రద్దు చేస్తామంటున్నారని దుయ్యబట్టారు.