శాసనమండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు

  • రూల్ 71 కింద నోటీసు ఇచ్చిన టీడీపీ
  • అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11 ఓట్లు
  • వైసీపీకి అనుకూలంగా ఓటేసిన పోతుల సునీత, శివనాగిరెడ్డి
శాసనమండలిలో రూల్ 71పై జరిగిన ఓటింగులో టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. రూల్ 71 కింద తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నోటీసుకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగిరెడ్డి ఓటేశారు. ఈ ఓటింగులో అనుకూలంగా 27 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. 9 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత, శివనాగిరెడ్డిపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. వారిపై చర్యల కోసం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఓటింగ్ అనంతరం శాసనమండలిని బుధవారానికి వాయిదా వేశారు.
Go Back to Shorts
Rule-71
Telugudesam
pothula sunitha
shivanagreddy
MLC

More Telugu News