'అహ నా పెళ్లంట' సినిమా నాకు కారును కానుకగా తెచ్చింది: రాజేంద్రప్రసాద్
- 'అహ నా పెళ్లంట' ఒక ట్రెండ్ ను సెట్ చేసింది
- నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అది
- జంధ్యాలగారికి కూడా కారు తెచ్చిపెట్టిందన్న రాజేంద్రప్రసాద్
ఈ సినిమా వరుసగా ఎన్నో రికార్డులను సృష్టించింది. తెలుగు కామెడీ సినిమా స్థాయిని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఇది. నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటి. జంధ్యాలగారు .. నేను కలిసి చేసిన సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అయిన సందర్భంగా రామానాయుడు గారు నాకు ఒక కారును కానుకగా ఇచ్చారు. ఆ తరువాత దర్శకుడు జంధ్యాల గారికి కూడా కొత్త కారును కానుకగా ఇచ్చారు.