ఇరాక్ లోని అమెరికన్ ఎంబసీపై రాకెట్ దాడి!
- సమీపంలో పేలిన మూడు రాకెట్లు
- ప్రాణ నష్టం సంభవించలేదన్న అధికారులు
- ఇంకా స్పందించని అమెరికా
ఇరాన్ సైనిక కమాండర్ సులేమానిని యూఎస్ దళాలు హతమార్చిన తరువాత, ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు యూఎస్ ఎంబసీపై క్షిపణి దాడులు జరుగగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ పై మరిన్ని దాడులను చేస్తామని హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో జరిగిన ఈ దాడి మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది.