కేసీఆర్ ను నాడు మోదీ ఆకాశానికెత్తేసిన వీడియోను పోస్టు చేసిన టీఆర్ఎస్ ఎంపీ
- మిషన్ భగీరథపై మోదీ ప్రశంసలు
- కేసీఆర్ ఆలోచన గొప్పది అంటూ పొగడ్తలు
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాత వీడియోను తెరపైకి తెచ్చిన సంతోష్
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఆ పథకాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ ఆలోచన ఎంతో గొప్పది అంటూ కీర్తించారు. అప్పట్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెద్దగా విభేదాలు లేని రోజుల్లో మోదీ పొగడ్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. అయితే, ఇప్పుడా పాత వీడియో సాయంతో మోదీ సైతం కేసీఆర్ గొప్పతనాన్ని అంగీకరించాడని చెప్పడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు సంతోష్ కుమార్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.