ప్రారంభమైన బీఏసీ సమావేశం.. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరు

  • కాసేపటి క్రితం ముగిసిన కేబినెట్ భేటీ
  • కాసేపట్లో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు
  • బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. కాసేపట్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశానికి వైసీపీ తరపున జగన్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు హాజరయ్యారు. టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై వీరు చర్చిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విశాఖకు సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలను తరలించాలనే నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
AP Assembly Session
Jagan
Kinjarapu Acchamnaidu

More Telugu News