అమెరికాలో శవమై తేలిన భారత సంతతి అమ్మాయి

  • గత డిసెంబరులో కనిపించకుండాపోయిన సురీల్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
  • కారు డిక్కీలో దుప్పట్లో చుట్టి ఉన్న సురీల్ మృతదేహం
అమెరికాలోని భారతీయ సమాజంలో విషాదం నెలకొంది. గత డిసెంబరులో కనిపించకుండాపోయిన సురీల్ దాబావాలా అనే 33 ఏళ్ల యువతి శవమై తేలింది. చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సురీల్ డిసెంబరు 30న అదృశ్యమైంది. ఆమె తండ్రి అష్రాఫ్ దాబావాలా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తన కుమార్తె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల రివార్డు కూడా ప్రకటించారు.

తాజాగా, తన సొంత కారులోనే విగతజీవిగా పడివున్న సురీల్ ను ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ గుర్తించింది. చికాగో పరిసరాల్లో కారు డిక్కీలో సురీల్ మృతదేహం దుప్పట్లో చుట్టి ఉంది. సురీల్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
Go Back to Shorts
USA
India
Sureel Dabawala
Police
Missing

More Telugu News