కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేతల భేటీ
- కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో సమావేశం
- ఇరు పార్టీల మధ్య పొత్తు ఏర్పడడం శుభ పరిణామమన్న జనసేన నేతలు
- ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వైసీపీ పరిపాలన సాగించాలని హితవు .
ఏపీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వైసీపీ పరిపాలన సాగించాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే సర్కారుపై తాము ఒత్తిడి తెస్తామని, రానున్న రోజుల్లో బీజేపీతో కలిసి సమస్యలపై పోరాడతామని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు సమాన దూరంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము సత్తా చాటుతామన్నారు.