Andhra Pradesh: మూడు రాజధానులపై గవర్నర్ కు వివరించనున్న చంద్రబాబు, అఖిలపక్ష జేఏసీ
- అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
- రేపు గవర్నర్ ను కలవాలని అమరావతి జేఏసీ నిర్ణయం
- రాజధాని మార్పు పరిణామాలను గవర్నర్ కు వివరించనున్న జేఏసీ
ఏపీలో మూడు రాజధానులు ఉంటాయని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలపడంతో రాజుకున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని అమరావతిలో రైతుల దీక్షలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అఖిలపక్ష నేతలు ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి మూడు రాజధానుల అంశం వివరించనున్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్ విధింపు, విజయవాడలో ర్యాలీ బస్సుల అడ్డగింపు, పోలీస్ స్టేషన్ లో నిర్బంధం వంటి అంశాలను గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రాజధాని మార్పుతో జరిగే నష్టం గురించి వివరించాలని నిర్ణయించారు.