Mangli: 'సర్కే చునారే తేరీ సర్కే' పాట.. క్షమాపణలు చెప్పిన గాయని మంగ్లీ
'సర్కే చునారే తేరీ సర్కే' పాట వివాదంపై ప్రముఖ గాయని మంగ్లీ స్పందించారు. తాను పాడిన ఈ పాట వివాదాస్పదం కావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. కన్నడ సినిమా 'కేడీ: ది డెవిల్' చిత్రంలోని ఈ పాటకు సంబంధించిన సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. హిందీ పాటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసభ్యకర పదాలు ఉండటంపై అందరినుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పాటను మంగ్లీ పాడారు.
ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి ఈ పాటను తొలగించినట్లు తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని, అయినప్పటికీ క్షమాపణలు కోరుతున్నానని సామాజిక మాధ్యమ వేదికగా పోస్టు పెట్టారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. లిరిక్స్‌లో మార్పులు చేశామని, ఈ పాట త్వరలో విడుదలవుతుందని వెల్లడించారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని పేర్కొన్నారు.