సిద్ధిపేట జిల్లా ఎంపీపీ అసభ్యంగా ప్రవర్తించాడని యువతి ఫిర్యాదు
- సిద్ధిపేట జిల్లాలోని మిర్దొడ్డి ఎంపీపీ సాయిలు
- భూ వివాదంలో యువతిపై దాడి
- పంట తగుల బెట్టాడని చెప్పిన యువతి
పెద్ద చెప్యాల ప్రాంతానికి చెందిన ఆ యువతి ఇటీవల తన భూ సమస్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శ్మశాన వాటిక కోసం తన భూమిని ఆక్రమించారని ఆమె పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే తన భూమిలోని పంటలను ఎంపీపీ ధ్వంసం చేశారని బాధిత యువతి చెప్పింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, ఎంపీపీ బారి నుంచి కాపాడాలని వేడుకుంది.