ప్రజల్ని హింసించిన ఏ పాలకుడు సుఖపడిన దాఖలాలు లేవు: వర్ల రామయ్య

  • సీఎం జగన్ పై వర్ల రామయ్య ధ్వజం
  • రాజధాని మార్పుపై ఆలోచన మార్చుకోవాలంటూ హితవు
  • లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్య
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్యం కంటే ప్రతీకారేచ్ఛ ఎక్కువగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన అందిస్తానని ప్రమాణం చేసి మాట తప్పడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజలను హింసించిన ఏ పాలకుడు సుఖపడిన దాఖలాలు లేవని, రాజధాని మార్పుపై ఆలోచన మార్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
Varla Ramaiah
Telugudesam
YSRCP
AP Capital

More Telugu News