భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్' సరికొత్త రికార్డు
- 'ధురంధర్' రెండు భాగాలు కలిపి రూ.3,000 కోట్లకు పైగా వసూళ్లు
- రూ.1,000 క్లబ్‌లో చేరిన 'ధురంధర్' చిత్రం రెండు భాగాలు
- బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలను దాటేసిన ధురంధర్
ధురంధర్ చిత్రం రూ.1,307 కోట్లకు పైగా, ధురంధర్: ది రివెంజ్ రూ.1,712 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ రెండు చిత్రాలు కలిపి రూ.3,019 కోట్ల వసూళ్లను రాబట్టాయి.
బాహుబలి మొదటి భాగం రూ.650 కోట్లు, రెండో భాగం రూ.1,788 కోట్లు వసూలు చేశాయి. ఈ రెండు చిత్రాలు కలిపి రూ.2,438 కోట్లు వసూలు చేశాయి. పుష్ప చిత్రం రూ.350 కోట్లు వసూలు చేయగా, పుష్ప-2 రూ.1,742 కోట్లను రాబట్టింది. ఈ రెండు చిత్రాలు కలిపి రూ.2,092 కోట్లు వసూలు చేశాయి.