ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ .. నిర్మాతగా కల్యాణ్ రామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ .. నిర్మాతగా కల్యాణ్ రామ్

  • త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ మధ్య చర్చలు 
  •  నిర్మాణ భాగస్వామిగా చినబాబు 
  • ఉత్సాహాన్ని చూపుతున్న ప్రభాస్
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఎన్టీఆర్ వున్నాడు. ఈ విషయాన్ని గురించి త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మాట్లాడటం .. ఆయన సుముఖాన్ని వ్యక్తం చేయడం జరిగిపోయిందట.

ఈ సినిమాకి 'హారిక అండ్ హాసిని' చినబాబు .. కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వుండనున్నారని అంటున్నారు. హారిక హాసిని వారు గీతా ఆర్ట్స్ తో కలిసి 'అల వైకుంఠపురములో' చేసినట్టుగానే, కల్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ సినిమా చేయనున్నారన్న మాట. ఇక త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రభాస్ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ముందుగా త్రివిక్రమ్ ఎవరితో కలిసి సెట్స్ పైకి వెళతాడో చూడాలి మరి.
Trivikram
Ntr
Prabhas

More Telugu News