ఆర్థిక లోటు భర్తీకి మోదీ ప్రభుత్వం ఇంకా చాలా దూరంలో ఉంది: రఘురాం రాజన్
- మరెన్నో సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్న ఆర్బీఐ మాజీ గవర్నర్
- ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో సాగుతోందని ఆందోళన
- పెట్టుబడులకు గణాంకాలు అనుకూలంగా లేవని వ్యాఖ్యలు
దేశంలో తీవ్రస్థాయిలో నిరుద్యోగం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న వృద్ధి రేటు ఏమాత్రం సమస్యను పరిష్కరింపజాలదని తెలిపారు. మరోవైపు పెట్టుబడులు ఆకర్షించాలన్నా గానీ ఆర్థిక గణాంకాలు అనుకూలంగా లేవని విశ్లేషించారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురాం రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.