చైనాలోని జియాంగ్సూ రాష్ట్ర జనాభా 8 కోట్లు.. పేదవారు మాత్రం 17 మందేనట!
- ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న జియాంగ్సూ నివేదిక
- ఆ 17 మంది ఆరు కుటుంబాల వారేనని వెల్లడి
- గత నాలుగేళ్లలో 2.54 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్న ప్రభుత్వం
అయితే, జియాంగ్సూ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చూసి ప్రపంచం విస్తుపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే విమర్శల జడివాన కురుస్తోంది. అదే రాష్ట్రానికి చెందిన పలువురు తామింకా పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. 1990 తర్వాత పెరిగిన ఆర్థిక అసమానతల్లో చైనా ముందుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి గణాంకాలు విడుదల కావడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.