కళంకిత మంత్రుల వ్యవహారంపై రాష్ట్రపతి వద్దకు చంద్రబాబు
రాష్ట్రంలోని అవినీతి మంత్రులను తొలగించాలని టీడీపీ రాష్ట్రపతిని కోరనుంది. ఒకవైపు రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే విషయమై టీడీపీ నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది. అదే సమయంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్నారు. కళంకిత మంత్రులను తొలగించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నారు.