ఇలా చేసుకుంటూ పోతే టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది: జయవర్ధనే
- టెస్ట్ క్రికెట్ ను నాలుగు రోజులకు కుదించే యోచనలో ఐసీసీ
- వ్యతిరేకిస్తున్న పలువురు క్రికెట్ దిగ్గజాలు
- దీనిని వ్యతిరేకిస్తున్నానన్న జయవర్ధనే
టెస్ట్ క్రికెట్ ను పాప్యులర్ చేయాలనే భావనతో డే-నైట్ టెస్టులను రూపొందించారని... వెంటనే నాలుగు రోజుల టెస్టులంటున్నారని జయవర్ధనే మండిపడ్డారు. లాభాల కోసం టెస్ట్ ఫార్మాట్ ను ఇలా మార్చుకుంటూ పోతే... చివరకు టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని అన్నాడు. టెస్ట్ క్రికెట్ స్వరూపాన్ని మార్చడానికి తాను పూర్తిగా వ్యతిరేకమని చెప్పాడు.