సిక్సర్ తో మ్యాచ్ ముగించిన కోహ్లీ... ఇండోర్ టి20లో టీమిండియా ఘనవిజయం
- టీమిండియా టార్గెట్ 143 రన్స్
- 17.3 ఓవర్లలో ఛేదన
- 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్
ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి మొదట శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్, సైనా రెండేసి వికెట్లతో రాణించారు. కాగా, ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టి20 జనవరి 10న పుణేలో జరగనుంది.