జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ నాయకురాలు ఐషే ఘోష్ పై కేసు నమోదు
- ఐషే ఘోష్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదు
- జేఎన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్
- సర్వర్ రూమ్ ను ధ్వంసం చేశారంటూ కేసు
హాస్టల్ ఫీజు పెంపును నిరసిస్తూ సర్వర్ రూమ్ లో ఉన్న వస్తువులను దోచుకోవడంతో పాటు, గదిలోని పరికరాలను ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. గదిలోకి ప్రవేశించే క్రమంలో సెక్యూరిటీ గార్డులపై కూడా దాడి చేశారని తెలిపారు. సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు విఘాతం కలిగించేలా టెక్నికల్ స్టాఫ్ ను భయపెట్టారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.