తన మాజీ ప్రేయసికి హార్దిక్ పాండ్యాతో నిశ్చితార్థం... స్పందించిన నటుడు అలై గోనీ!
- స్టాన్ కోవిచ్ తో హార్దిక్ ఎంగేజ్ మెంట్
- దుబాయ్ లో ఉంగరాల మార్పు
- హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసిన స్టాన్ కోవిచ్ మాజీ ప్రియుడు
గతంలో నటాషాతో ప్రేమాయణం జరిపిన అలై గోనీ, తన సోషల్ మీడియా ఖాతాలో హార్దిక్, నటాషా ఫోటోను చూపిస్తూ, ఓ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేశాడు. హార్ట్ ఎమోజీని వారిద్దరికీ గిఫ్ట్ గా పంపాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్, నటాషా జంటకు భారత క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ధోని, కోహ్లీ, కులదీప్, అజయ్ జడేజా తదితరులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.