కశ్మీర్ లో పోలీసులకు పట్టుబడిన లష్కర్ ఉగ్రవాది

  • ఏడాది కిందట లష్కరే తోయిబాలో చేరిన కశ్మీర్ యువకుడు
  • ఆర్మీతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన కశ్మీర్ పోలీసులు
  • భారీగా ఆయుధాలు స్వాధీనం
ఏడాది కాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాదిని జమ్మూకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందిపొరా జిల్లాకు చెందిన నిస్సార్ దార్ మొదట ఉగ్రవాద సానుభూతిపరుడిగా ముద్రపడ్డాడు. ఆ తర్వాత ఏకంగా లష్కరే తోయిబా గ్రూపులో చేరాడు.

కొంతకాలంగా భద్రతాబలగాలపై దాడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు గుర్తించారు. వాస్తవానికి నిస్సార్ గతేడాది జరిగిన ఎన్ కౌంటర్ లో కొద్దిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఇప్పటివరకు అతడిపై 8 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈసారి ఆర్మీతో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ తో నిస్సార్ పోలీసుల చేతచిక్కాడు. అతడి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Go Back to Shorts
Jammu And Kashmir
Police
Army
Lashkar-e-Toiba
Pakistan

More Telugu News