డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి 'టిక్ టాక్ వీడియో'పై టీడీపీ నేత పంచుమర్తి విమర్శలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి 'టిక్ టాక్ వీడియో'పై టీడీపీ నేత పంచుమర్తి విమర్శలు

  • 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న' అనే పాటకు టిక్ టాక్
  • హావభావాలు పలికిస్తూ ఆమె చేసిన వీడియో వైరల్
  • పరిపాలన అంటే టిక్‌ టాక్‌లు చేయడం కాదన్న అనురాధ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తన అభిమానాన్ని చాటుతూ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఓ టిక్ టాక్ వీడియో చేసిన విషయం తెలిసిందే. 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న' అనే పాటకు హావభావాలు పలికిస్తూ ఆమె చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. పరిపాలన అంటే టిక్‌ టాక్‌లు చేయడం కాదన్న విషయాన్ని ఆమె తెలుసుకోవాలని హితవు పలికారు.

 సమస్యలు చెప్పుకునేందుకు తన వద్దకు వచ్చే ప్రజలకు మంత్రి పుష్ప శ్రీవాణి అందుబాటులోకి రారని అనురాధ ఆరోపించారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన చేతి గాజును అమరావతి పరిరక్షణ సమితికి ఇచ్చిన విషయంపై పుష్ప శ్రీవాణి చేసిన విమర్శలకు కూడా అనురాధ కౌంటర్ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే.. వారి  దుస్థితి చూసి చలించిపోయిన భువనేశ్వరి... తన చేతి గాజును తీసి ఇచ్చారని చెప్పారు. రైతుల దీక్షకు మద్దతిచ్చిన భువనేశ్వరిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
tiktok
Andhra Pradesh
Telugudesam

More Telugu News