రాజకీయాలకు అనర్హుడినంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే రాజీనామా
- మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదనే...?
- మంత్రివర్గ విస్తరణ చేపట్టిన వెంటనే రాజీనామా
- రాజకీయాలకు దూరంగా ఉంటానన్న ప్రకాశ్ సోలంకీ
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కొన్నిగంటలకే సోలంకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన రాజీనామా నిర్ణయానికి, కేబినెట్ లో స్థానం దక్కకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని సోలంకీ అన్నారు. అయితే.. కేబినెట్ విస్తరణ తాను రాజకీయాలకు అనర్హుడినని నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలో ఉద్ధవ్ థాకరే సీఎంగా కాంగ్రెస్,శివసేన, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం మంత్రి వర్గ విస్తరణ జరిపారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, మొత్తం మూడు పార్టీలనుంచి 36 మంది మంత్రులు, సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.