రాజధాని తరలింపుపై పిటిషన్... విచారణ చేపట్టిన హైకోర్టు
- హైకోర్టుకు చేరిన రాజధాని తరలింపు వ్యవహారం
- పిటిషన్ దాఖలు చేసిన రాజధాని రైతు పరిరక్షణ సమితి
- తదుపరి విచారణ జనవరి 23న ఉంటుందన్న హైకోర్టు
ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 21 నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ఇరువర్గాలను ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 23న ఉంటుందని పేర్కొంది. కాగా, రాజధాని రైతు పరిరక్షణ సమితి తన పిటిషన్ లో జీఎన్ రావు కమిటీ చట్టబద్ధతను కూడా ప్రశ్నించింది. ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, తక్షణమే పిటిషన్ పై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.