ఓ సీఎం ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటాననడం ఇదే తొలిసారి: యోగిపై ప్రియాంక విసుర్లు
- యూపీ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటున్న ప్రియాంక
- సీఎం యోగిపై వ్యాఖ్యలు
- కాషాయం ధరిస్తే సరిపోదంటూ వ్యంగ్యం
హిందూ ధర్మం అంటే శాంతికి ప్రతిరూపమని, కాషాయానికి అర్థం కూడా అదేనని అన్నారు. కానీ, కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి నోట ప్రతీకారం అనే మాట రావడం దారుణమని పేర్కొన్నారు. కాషాయం ధరించినంత మాత్రాన హిందుత్వానికి ప్రతీకలు అయిపోరని యోగికి చురకలంటించారు. యూపీలో అధికారులు, పోలీసులు యోగి ఏంచెబితే అది చేస్తున్నారని ఆరోపించారు.