కథను బట్టే హీరోను గురించి ఆలోచిస్తాను: దర్శకుడు రాజమౌళి

  • పెద్ద హీరోలతోనే చేయాలనే ఆలోచనేం లేదు
  • చిన్న హీరోలతో చేయడానికి వెనుకాడను 
  • మొదటి నుంచి నా పద్ధతి అదేనన్న రాజమౌళి
తెలుగు తెరపై అద్భుతాలు సృష్టించిన దర్శకులలో రాజమౌళి ఒకరు. కథాకథనాలు .. పాత్రలను మలిచే విధానం .. పాటలు .. పోరాట సన్నివేశాల చిత్రీకరణ విషయంలో రాజమౌళి శైలి ప్రత్యేకం. తాజాగా 'మత్తు వదలరా' సినిమాలో నటించిన ముగ్గురు నటులను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. అదే సమయంలో వాళ్ల ప్రశ్నలకి ఆయన స్పందిస్తూ .. "పెద్ద హీరోలతోనే సినిమాలు చేయాలి .. చిన్న హీరోలతో చేయకూడదని నేను ఎప్పుడూ అనుకోలేదు"అన్నారు.

 "చిన్న హీరోలతో చేస్తే బడ్జెట్ పరిమితులు ఉంటాయి .. అలాంటివాళ్లతో చేస్తే నా రేంజ్ తగ్గిపోతుందని కూడా నేను ఎప్పుడూ ఆలోచించను. నా దగ్గరున్న కథకు పెద్ద హీరో సెట్ అవుతాడా?  చిన్నహీరో సెట్ అవుతాడా? అనే విషయాన్ని గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. కథను బట్టి హీరోను ఎంచుకోవడమే నాకు అలవాటు. అదే పద్ధతిని ఇక ముందు కూడా అనుసరిస్తాను" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Rajamouli

More Telugu News