సీఎం జగన్ ను ఎద్దేవా చేస్తూ హరీశ్ రావు వీడియో పోస్టు చేసిన నారా లోకేశ్

  • అమరావతిపై అనిశ్చితి
  • వైసీపీ సర్కారుపై లోకేశ్ వ్యంగ్యాస్త్రం
  • పక్క రాష్ట్రాల మంత్రులు జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని సెటైర్
ఏపీలో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యంగ్యం ప్రదర్శిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ గారి అద్భుత పాలనా పాటవాల గురించి పక్క రాష్ట్రాల మంత్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూడండి అంటూ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఏపీలో పరిస్థితులు బాగా కలిసొచ్చాయి అంటూ వ్యాఖ్యానించడం చూడొచ్చు. ఏపీ రాజధాని అమరావతిలో అనిశ్చితి కారణంగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుందన్న కోణంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సరిగ్గా, ఈ కామెంట్ తోనే సీఎం జగన్ ను లోకేశ్ ఎద్దేవా చేస్తూ తాజా ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది.
Go Back to Shorts
Jagan
YSRCP
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Amaravathi
Harish Rao
Telangana
Hyderabad

More Telugu News