నేడు హేమంత్ సోరేన్ ప్రమాణం... హాజరుకానున్న కాంగ్రెస్ దిగ్గజాలు!
- ఝార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా సోరెన్
- హాజరుకానున్న ప్రణబ్, రాహుల్, ప్రియాంక
- కమల్ నాథ్, కేజ్రీవాల్, మమత, ఉద్ధవ్ కూడా
వాస్తవానికి సోనియా గాంధీ కూడా కార్యక్రమానికి రావాల్సివుందని, అయితే, ఆమె స్వల్ప అనారోగ్యంతో ఉండటంతో రాలేకపోతున్నారని తెలిపాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కూడా సోరెన్ ప్రమాణానికి హాజరు కానున్నారు. ఝార్ఖండ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి, జేఎంఎం - కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.