తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో పేలిన నాటు బాంబు.. దద్దరిల్లిన ఆసుపత్రి పరిసరాలు!
- బాంబును నోట కరచుకుని వచ్చిన శునకం
- ఆవరణలో పెద్ద శబ్దంతో పేలుడు
- అక్కడికక్కడే మృతి చెందిన శునకం
బాంబు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ నాటుబాంబును శునకం ఎక్కడి నుంచి తెచ్చి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.