మానవ గరిష్ఠ జీవితకాలం 38 ఏళ్లు మాత్రమే... మిగతాదంతా బోనస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మానవ గరిష్ఠ జీవితకాలం 38 ఏళ్లు మాత్రమే... మిగతాదంతా బోనస్!

  • ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన
  • తొలినాటి ఆధునిక మానవ ఆయుర్దాయంపై అంచనాలు
  • మారిన ప్రమాణాలతో పెరిగిన జీవితకాలం
మానవ జీవితకాలం ఎంత? ఈ ప్రశ్నకు ఇంతవరకూ నూరేళ్లని, నిండు నూరేళ్లూ బతికి ఉంటే, జీవితకాలాన్ని పూర్తి చేసినట్టన్న సమాధానమే స్ఫురణకు వస్తుంది. కానీ, మానవ జీవితకాలం గరిష్ఠంగా 38 సంవత్సరాలు మాత్రమేనని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.

మనిషి ఎన్నేళ్లు బతికినా సహజసిద్ధ ఆయుర్దాయం 38 ఏళ్లేనని తొలినాటి ఆధునిక మానవ జన్యు గడియారం ఆధారంగా గుర్తించామని ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న బెన్ మేన్ వెల్లడించారు. తొలినాటి ఆధునిక మానవ ఆయుర్దాయంపై తాము వేసిన అంచనాలతో ఇది సరిపోయిందన్నారు. అయితే, కొన్ని శతాబ్దాలుగా జరిగిన మార్పులు, వైద్య శాస్త్రంలో పురోగతి, జీవన ప్రమాణాల మెరుగు తదితర కారణాలతో జీవితకాలం పెరిగిందని అన్నారు.  

కాగా, కాలగర్భంలో కలసిపోయిన వూలీ మామోత్, నియాండెర్తల్ జాతుల్లోని మనుషుల జీవితకాలాన్ని ఈ పరిశోధన వెలుగులోకి తీసుకుని వచ్చింది. 'డీఎన్ఏ మిథలైజేషన్' అనే జన్యు మార్పు, వెన్నెముక ఉండే జీవుల్లో గరిష్ఠ జీవన స్థాయి ఎంతన్న విషయాన్ని తేలుస్తుందని బెన్ మేన్ వెల్లడించారు. ఈ జన్యు గడియారమే జన్యువులు ఎప్పుడు యాక్టివేట్ కావాలన్న విషయాన్ని నిర్ధారించేందుకు సాయం చేస్తుందని, 42 రకాల జన్యువుల్లో మిథైలేషన్ సాంధ్రత ఆధారంగా కచ్చిత ఆయుర్దాయాన్ని అంచనా వేయవచ్చని ఆయన తెలియజేశారు.
Man
Age
Geens
Australia
Scientists

More Telugu News