జగన్‌కు, వైసీపీ గ్యాంగ్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు: కేశినేని నాని వ్యంగ్యం

  • ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేశారు
  • రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు.. 
  • మీరు హ్యాపీగా ఉండాలని భగవంతుడిని కోరుకోండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 'ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన జగన్ & గ్యాంగ్ వైసీపీ పార్టీకి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు.. రాష్ట్రం ఏమి అయినా ఫర్వాలేదు.. మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్మస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి' అని ఎద్దేవా చేశారు.

కాగా, రాష్ట్ర ప్రజలకు కేశినేని నాని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Kesineni Nani
YSRCP
Jagan

More Telugu News