ఎన్నడైనా నిజం మాట్లాడావా?: ఖుష్బూపై గాయత్రీ రఘురామ్ విమర్శలు

  • పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన ఖుష్బూ
  • ట్విట్టర్ లో పెట్టిన పోస్టుపై గాయత్రి ఫైర్
  • బీజేపీని విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టిన నటి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఖుష్బూపై బీజేపీ సభ్యురాలు, హీరోయిన్ గాయత్రీ రఘురామ్ నిప్పులు చెరిగారు. తన ట్విట్టర్ ఖాతాలో ఎదురుదాడికి దిగిన గాయత్రి, ఖుష్బూ ఎన్నడూ నిజాలు మాట్లాడలేదని, అన్నీ అబద్ధాలే చెబుతారని విమర్శించారు. తప్పుడు మాటలు చెబుతుండే నీవంటి వారికి, కాంగ్రెస్ నేతలకు, బీజేపీని విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. ఇక వీరిద్దరి ట్విట్టర్ వార్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Kushboo
Gayatri Raghuram
Twitter

More Telugu News