తిరుమలలో భక్తుల రద్దీ అధికం!

  • వారాంతం ముగిసినా తగ్గని రద్దీ
  • 26 కంపార్టుమెంట్లలో భక్తులు
  • దర్శనానికి 16 గంటల సమయం
తిరుమల గిరులు భక్త జనులతో కిక్కిరిసి ఉన్నాయి. వారాంతం ముగిసినా రద్దీ ఏ మాత్రమూ తగ్గలేదు. స్వామివారి సర్వదర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి 16 గంటల సమయం తరువాతనే దర్శనం జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక టైమ్ స్లాట్ దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల వరకూ సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు అన్న పానీయాలను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. నిన్న వెంకన్నను 85,869 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 3 కోట్లకు పైగా ఆదాయం లభించింది.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News