ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ పదవిపై ఇప్పటికీ ఆసక్తి ఉంది: ఐవైఆర్ కృష్ణారావు

మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఓ వార్తా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిపై తనలో ఇప్పటికీ ఆసక్తి పోలేదని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ముందుకు వచ్చి చైర్మన్ పదవి ఇస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. జగన్ ఈ పదవి కోసం తనను ఎందుకు ఆహ్వానించలేదో తనకు తెలియదని, బహుశా తాను బీజేపీలో ఉండడం వల్ల ఆయన ఆసక్తి చూపించి ఉండకపోవచ్చని అన్నారు. అజయ్ కల్లం రిటైర్ అయినాగానీ ఆయన ఏ పార్టీలో లేకపోవడంతో జగన్ ఆయనవైపు మొగ్గుచూపారని పేర్కొన్నారు. అయితే, పదవి కోసం బీజేపీని వదిలేది లేదని స్పష్టం చేశారు. ​రాజకీయాల్లో పదవి ఉంటేనే విజయవంతం అయినట్టు కాదని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.​


More Telugu News