స్వీటెనర్లను ఉపయోగిస్తున్నారా? అయితే.. మీకు టైప్-2 మధుమేహం రావొచ్చు!
- దక్షిణ ఆస్ట్రేలియా వర్సిటీ పరిశోధనలో వెల్లడి
- బరువు పెరగడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి దుష్పరిణామాలు
- బేకరీ ఉత్పత్తుల్లో ఎక్కువగా స్వీటెనర్ల ఉపయోగం
స్వీటెనర్ల ప్రభావంతో శరీరంలోని హానిచేయని బ్యాక్టీరియా స్వరూప స్వభావాల్లో మార్పులు జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రభావం టైప్-2 మధుమేహానికి దారి తీయడంతోపాటు అధిక బరువు ముప్పు కూడా ఉంటుందని అధ్యయనంలో తేలింది. అంతేకాదు, స్వీటెనర్కు అలవాటు పడిన వృద్ధుల్లో జ్ఞాపకశక్తి తగ్గడం, గుండెపోటు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలినట్టు నిపుణులు తెలిపారు.