కోల్ కతా హైకోర్టులో మమతా బెనర్జీపై మూడు పిటిషన్లు

  • పిటిషన్లు వేసిన ఇద్దరు అడ్వొకేట్లు, ఒక వ్యాపారవేత్త
  • పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమనడంపై తొలి పిటిషన్
  • ప్రకటనలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ మరో పిటిషన్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్ కతా హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇద్దరు అడ్వొకేట్లు, ఒక వ్యాపారవేత్త ఈ పిటిషన్లు వేశారు. పశ్చిమబెంగాల్ లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని మమత ప్రకటించడంపై తొలి పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదంటూ అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారని, ఈ ప్రకటనలకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ రెండో పిటిషన్ దాఖలైంది. కోల్ కతా మేయర్ ఫరీద్ హకీంను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలని కోరుతూ మూడో పిటిషన్ దాఖలైంది.
Go Back to Shorts
Mamata Banerjee
West Bengal
TMC

More Telugu News