‘దిశ’ దారుణానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. మతిస్థిమితం లేని యువతిపై ఆటోడ్రైవర్ల అఘాయిత్యం!

17-12-2019 Tue 07:34 | Telangana
  • గత నెల 26న హైదరాబాద్‌లో ఘటన
  • సైగల ద్వారా ఏం జరిగిందో చెప్పిన బాధితురాలు
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన దిశ హత్యాచార ఘటనకు సరిగ్గా ఒక రోజు ముందు హైదరాబాద్‌లో జరిగిన దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గత  నెల 26న పాతబస్తీలోని ఓ మానసిక వికలాంగురాలిపై ఇద్దరు ఆటోడ్రైవర్లు, ఓ బ్యాండ్‌మాన్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులైన ముగ్గురు యువకులు ఖలీమ్, అజీజ్, నజీర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని కుల్సుంపురా పరిధిలో 19 ఏళ్ల మానసిక వికలాంగురాలు తల్లి, సోదరులతో కలిసి ఉంటోంది. మతిస్థిమితం లేని యువతి అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోవడం, సోదరులు వెళ్లి తీసుకురావడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో గత నెల 26న ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి పురానాపూల్ చౌరస్తా వద్దకు చేరుకుంది.

అక్కడ ఆమెను చూసిన ఆటో డ్రైవర్లు ఖలీమ్ (28), అతడి బంధువు అబ్దుల్ అజీజ్ (38)లు యువతి వద్దకు వెళ్లి ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. అనంతరం మూసీ నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే రోజు రాత్రి 8:30 గంటలకు బాధితురాలిని జుమ్మెరాత్ బజార్‌లో దింపి, అక్కడే ఉన్న బ్యాండ్‌మాన్ నజీర్ (46)కు అప్పగించి ఆమె అడ్రస్ తెలుసుకుని వారి ఇంట్లో అప్పగించాలని చెప్పి వెళ్లిపోయారు. వారు వెళ్లగానే నజీర్ కూడా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం అర్ధరాత్రి వేళ ఆమెను పురానాపూల్ చౌరస్తాలో వదిలి వెళ్లిపోయాడు.

సోదరి కనిపించకపోవడంతో అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె సోదరులు.. పురానాపూల్ వద్ద కనిపించిన ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని సైగల ద్వారా వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మానసిక నిపుణులు, వైద్యుల సాయంతో ఆమెను మాట్లాడించి చికిత్స అందించారు. ఆమె చెప్పిన దానిని బట్టి అత్యాచారం జరిగినట్టు నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
HyderabadDishaGirlRape

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more