‘రైతు భరోసా’నగదు కోసం వివాదం.. తమ్ముడి కుటుంబంపై అన్న కాల్పులు!

  • విశాఖపట్టణం జిల్లాలో జరిగిన ఘటన
  • ‘రైతు భరోసా’లోతన వాటా డబ్బు అడిగిన తమ్ముడు
  • తమ్ముడి భార్య చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్ 
ఏపీలో రైతు భరోసా పథకం కింద ఇచ్చిన నగదు కోసం అన్మదమ్ముల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకు వెళ్లింది. విశాఖపట్టణం జిల్లాలోని హుకుంపేట మండలం రంగశీలలో ఈ ఘటన జరిగింది. తన వాటా డబ్బులు అడిగిన తమ్ముడి కుటుంబంపై ఆగ్రహించిన అన్నయ్య కృష్ణ తన నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికుల సాయంతో కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడ్డ కృష్ణ పరారీలో ఉన్నాడు.
Go Back to Shorts
Visakhapatnam District
Rangaseela
Rythu Bharosa

More Telugu News