ఇంటిపేరు 'సావర్కార్' ఉండాలంటే వీరుడై ఉండాలి: రాహుల్ పై శివరాజ్ చౌహాన్ సెటైర్!
- రాహుల్ వ్యాఖ్యలపై దుమారం
- సావర్కార్ అంటే త్యాగం, వీరత్వమన్న సంజయ్ రౌత్
- రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఫడ్నవీస్
సావర్కార్ అంటే త్యాగం, వీరత్వం అని శివసేన నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని కొనియాడారు. గాంధీ, నెహ్రూలా దేశం కోసం ఆయన శ్రమించారని, ప్రాణాలను అర్పించిన యోధుడని గుర్తు చేశారు. సావర్కార్ ను అవమానిస్తే తాము చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. ఇదే విషయమై మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ, రాహుల్ వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు.