పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోవడానికి నాదెండ్ల మనోహరే కారణం: జనసేన ఎమ్మెల్యే రాపాక
- అన్ని విషయాలపై పవన్, మనోహర్ మాత్రమే సంప్రదించుకుంటారు
- వ్యక్తిగతంగా నాదెండ్లతో నాకు ఇబ్బంది లేదు
- అసెంబ్లీ సమావేశాల కారణంగానే పవన్ దీక్షకు హాజరుకాలేదు
తాను పార్టీ మారాలనుకోవడం లేదని రాపాక తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమేనని చెప్పారు. గతంలో నేతలకు రాజకీయ విలువలు ఉండేవని, పార్టీ మారే నేతలను ప్రజలు కూడా వ్యతిరేకించేవారని... ఇప్పుడు నేతలకు నిజాయతీ లేదని... నేతలు పార్టీలు మారినా ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.