విమానం ఆలస్యం.. రాత్రంతా ఇండిగో ప్రయాణికుల పడిగాపులు
- తొమ్మిది గంటలు ఆలస్యంగా వచ్చిన లోహవిహంగం
- సమాచారం లేకపోవడంతో తప్పని ఎదురుచూపు
- ఏరో బ్రిడ్జిపై సేదదీరిన ప్రయాణికులు
రాత్రంతా వేచి చూసినా విమానం రాలేదు. విమాన సిబ్బంది సరైన సమాచారం ఇవ్వక పోవడం, వేచి ఉండేందుకు మార్గం లేకపోవడంతో ఏరో బ్రిడ్జిపైనే రాత్రంతా ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. దాదాపు 9 గంటలు ఆలస్యమైనా సరైన సమాచారం లేకపోవడంతో విమాన నిర్వాహకుల తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.