గుంటూరు జిల్లా వినుకొండలో చడ్డీ గ్యాంగ్ పట్టివేత
- ఓ అపార్ట్ మెంట్ వద్ద అనుమానాస్పద సంచారం
- పోలీసుల అదుపులో ముగ్గురు గుజరాతీలు
- నరసరావుపేటలోనూ చోరీలకు పాల్పడినట్టు అనుమానం
పోలీసుల అదుపులో ఉన్న ఆ ముగ్గురు గుజరాత్ కు చెందిన జశ్వంత్ భాయ్, తారా సింగ్, సబూర్ భాయ్ గా గుర్తించారు. వినుకొండలోని శివసాయి అపార్ట్ మెంట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు అక్టోబరు 23న కూడా ఇదే అపార్ట్ మెంట్ వద్ద కలియదిరిగినట్టు గుర్తించారు. నిందితులు నరసరావుపేటలో కూడా పలు చోరీలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.