నూర్ అహ్మద్ కుటుంబానికి విరాళం ప్రకటించిన రామ్ చరణ్
- రూ.10 లక్షల విరాళం ప్రకటన
- నూర్ అహ్మద్ మెగా అభిమానులందరిలోకి గొప్పవ్యక్తి
- ఆయన లేని లోటు తీరనిది: రామ్ చరణ్
నూర్ అహ్మద్ గారు మెగా అభిమానులందరిలోకీ గొప్ప వ్యక్తి అని, తమ పేరు మీద ఆయన ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారని, తమ పుట్టినరోజులను పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారని కొనియాడారు. నూర్ అహ్మద్ లేని లోటు తీరనిదని, ‘మెగా బ్లడ్ బ్రదర్’ నూర్ అహ్మద్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.