మరికొన్ని గంటల్లో ఉప ఎన్నికల ఫలితాలు.. ఆలయాల చుట్టూ నేతల ప్రదక్షిణలు!

  • మంజునాథుడిని దర్శించుకున్న యడియూరప్ప
  • సాయినాథుడిని దర్శించుకున్న దేవెగౌడ
  • కనీసం ఆరు స్థానాలు గెలుచుకుంటేనే బీజేపీ మనుగడ
దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. దీంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీదే విజయమని చెప్పినప్పటికీ నేతల్లో మాత్రం టెన్షన్ పోవడం లేదు. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికలు ఎంతో కీలకం. ఆ పార్టీ కనీసం ఆరు సీట్లు గెలుచుకుంటేనే ప్రభుత్వం సేఫ్‌గా ఉంటుంది. లేదంటే మైనారిటీలో పడిపోతుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ధర్మస్థలిలోని  మంజునాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ షిర్డీ వెళ్లి సాయినాథుడిని దర్శించుకున్నారు.
Go Back to Shorts
Karnataka
yeddyurappa
bypolls
devegowda

More Telugu News