విమానం కదులుతుండగా ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకిన ప్రయాణికుడు
- చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ఆగకముందే దూకిన ప్రయాణికుడు
- ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది
- అస్వస్థత కారణంగా దూకి ఉంటాడన్న అధికారులు
- అప్పటికే విమానంలో వామ్‌టింగ్ చేసుకున్నట్లు వెల్లడి
షార్జా-చెన్నై విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దూకడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో, తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వేకువజామున షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానం ల్యాండ్ కాగానే, ట్యాక్సీవేపై కదులుతుండగా సదరు ప్రయాణికుడు బయటకు దూకాడు.
ఈ సంఘటన జరిగిన వెంటనే పైలట్ గ్రౌండ్ సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం అతడిని పోలీసులకు అప్పగించారు. "ఆ ప్రయాణికుడు కిందకు దూకినప్పుడు విమానం ఇంకా నెమ్మదిగా కదులుతూనే ఉంది. అతడికి ఏమీ కాలేదు. విమానానానికి కూడా నష్టం జరగలేదు" అని విమానాశ్రయ సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
విమాన ప్రయాణం సమయంలో అతడు అస్వస్థతకు గురై ఉండవచ్చని అధికారులు తెలిపారు. తనకు వామ్‌టింగ్ వస్తున్నదని అతను విమానంలో సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడు. విమానంలో కూడా రెండుసార్లు వామ్‌టింగ్ చేసుకున్నాడని చెప్పారు. అస్వస్థత కారణంగానే అతడు విమానం కదులుతుండగానే దూకి ఉండవచ్చని చెబుతున్నారు.
ఆ ప్రయాణికుడిని తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటన వల్ల కొద్దిసేపు విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ముందుజాగ్రత్త చర్యగా తెల్లవారుజామున గంటసేపు ప్రధాన రన్‌వేను మూసివేసి, విమానాలను మరో రన్ వేకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.